”>
>div>

RT

Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Thursday, November 12, 2015

విజయవంతంగా గగనతలంలోకి జీశాట్‌-15

భారత కమ్యూనికేషన్‌ రంగంలో మరో ముందడుగు పడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రూపొందించిన అత్యాధునిక ఉపగ్రహం జీశాట్‌-15ను ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి బుధవారం తెల్లవారుజామున 3.04 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. అరైన్‌ వీఏ-227 అనే వాహక నౌక ద్వారా విజయవంతంగా దీన్ని నింగిలోకి పంపినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం సమాచార వ్యవస్థలో సేవలందిస్తున్న ఇన్‌శాట్‌ 3ఎ, 4బి ఉపగ్రహాల కాలపరిమితి కొద్దిరోజుల్లో ముగియనుండడంతో వాటి స్థానంలో దీన్ని ప్రయోగించారు. సుమారు 12 ఏళ్లపాటు ఈ ఉపగ్రహం నావిగేషన్‌ సేవల్ని అందించనుంది.జీశాట్‌-15 ఉపగ్రహంలో కేయూ బ్యాండ్‌లో 24 ట్రాన్స్‌పాండర్లు అమర్చారు. డీటీహెచ్‌, బ్రాడ్‌బ్యాండ్‌, వార్తాఛానళ్ల డీఎస్‌ఎన్‌జీ సేవలను ఇది అందించనుంది. సుమారు 3,164 కిలోల బరువుగల జీశాట్‌-15 ప్రయోగం కోసం రూ.660 కోట్లు ఖర్చు చేసినట్లు ఇస్రో తెలిపింది. గతంలో ఇస్రో ప్రయోగించిన జీశాట్‌-8, జీశాట్‌-10లను కూడా నావిగేషన్‌ సేవల కోసం వినియోగిస్తున్నారు. జీశాట్‌-15 తనతో పాటు గగన్‌ అనే నావిగేషన్‌ ఉపగ్రహ ట్రాన్స్‌పౌండర్‌ను తీసుకెళ్లింది. ఇది ఎయిర్‌లైన్స్‌, ఇతర జీపీఎస్‌ సేవలకు ఉపయోగపడుతుంది. ప్రయోగానంతరం జీశాట్‌-15 సిగ్నల్స్‌ కర్ణాటకలోని హసన్‌ నియంత్రణ కేంద్రానికి చేరాయి.ఉపగ్రహ వివరాలు సంక్షిప్తంగా..జీశాట్‌ బరువు: 3,164 కిలోలుజీవితకాలం: 12 ఏళ్లుప్రయోగ ఖర్చు: రూ.660 కోట్లుప్రయోగకేంద్రం: ఫ్రెంచ్‌ గయానాలోని (దక్షిణ అమెరికా) కౌరు అంతరిక్ష కేంద్రం

Wednesday, November 11, 2015

నింగిలోకి వెళ్లనున్న జీశాట్-15

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన సమాచార ఉపగ్రహం జీశాట్-15 భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నింగిలోకి వెళ్లనుంది.యూరోపియన్ స్పేన్ ఏజెన్సీకి చెందిన ఏరియానేస్పేన్ రాకెట్ ఏరియానే5 జీశాట్-15 ఉపగ్రహాన్ని నింగిలో ప్రవేశపెట్టనుంది. ఇన్‌శాట్/జీశాట్ సిస్టమ్‌లో జీశాట్-15 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు.మెరుగైన సమచార సేవలను అందించడానికి జీశాట్-15 ఉపయోగపడుతుంది.ఇది టెలికమ్యూనికేషన్,నావిగేషన్,అత్యవసర సేవలు అందిస్తుంది.ఫ్రెంచ్ గుయానాలోని యూరవ్ స్పేస్‌పొర్ట్ లాంచ్ జోన్‌లో ఏరియానే5 రాకెట్‌ను నింగిలోకి పంపేందుకు సిద్ధం చేస్తున్నారు.ఇందులో జీశాట్-15తో పాటు అరబ్ శాట్-6బి ఉపగ్రహాన్ని కుడా పంపనున్నారు.

Sunday, November 1, 2015

హెల్మెట్ తప్పనిసరి

హెల్మెట్ ధరించటం ఖచ్చితంగా అమలవనుండటంతో ద్విచక్ర వాహనదారులలో హడావుడి మొదలైంది. ఇప్పటికే హెల్మెట్లు కొనుగోలు చేసి పోలీసులు పట్టించుకోని కారణంగా వాటిని పక్కనపెట్టిన వాహనదారులు వాటిపై పేరుకుపోయిన దుమ్ము తొలగించి ఆదివారం నుంచి ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక ఇప్పటి వరకు హెల్మెట్లు కొనుగోలు చేయని వాహనదారులు హెల్మెట్లు వినియోగం తప్పనిసరని పోలీసులు ప్రకటించటంతో వాటి కొనుగోలులో తలమునకలయ్యారు. ఆదివారం నుంచి హెల్మెట్ ధరించటం తప్పనిసరి అని ప్రకటించిన పోలీసు యంత్రాంగం హెల్మెట్ లేకుండా తొలిసారి పట్టుబడితే వందరూపాయల జరిమానా, రెండవసారి పట్టుబడితే మూడునెలల పాటు వాహనాన్ని సీజ్ చేయటంతోపాటు లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తామని ప్రకటించటంతో హెల్మెట్ ధరించటం ఇక తప్పనిసరని వాహనదారులు అభిప్రాయానికి వచ్చారు. హైకోర్టు కూడా హెల్మెట్ వినియోగంపై ఖచ్చితమైన ఆదేశాలు జారీచేయటంతో పోలీసు యంత్రాంగం ఆదివారం నుంచి హెల్మెట్ నిబంధనలను కరాఖండిగా అమలు చేయాలనే ప్రయత్నంలో ఉంది. దాంతో ఇప్పటి వరకు హెల్మెట్లు కొనుగోలు చేయని వాహనదారులు గడచిన రెండురోజుల నుంచి జిల్లా కేంద్రం విజయనగరంతోపాటు జిల్లాలోని బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లి తదితర పట్టణాల్లో కొత్త హెల్మెట్ కొనుగోలులో బిజీబిజీగా ఉన్నారు. గడచిన ఆరునెలలుగా హెల్మెట్ల వాడకం ఇప్పుడు, అప్పుడు అంటూ వాయిదా పడుతుండగా, ఇక ఈసారి హెల్మెట్ వాడకం తప్పనిసరని తేలిపోవటంతో హెల్మెట్లు విక్రయించే షాపులు హెల్మెట్ల ధరలను విపరీతంగా పెంచేసి విక్రయిస్తున్నాయి. రెండు, మూడునెలల కిందట నాలుగు వందల రూపాయలకు విక్రయించిన హెల్మెట్లను ఇప్పుడు ఎనిమిది వందల రూపాయలకు విక్రయిస్తున్నారు. అప్పట్లో పేరున్న కంపెనీల హెల్మెట్లు ఎనిమిది వందల నుంచి వేయి రూపాయలకు విక్రయించగా ఇప్పుడు వాహనదారుల అవసరాలను ఆసరాగా తీసుకుని 12వందల నుంచి రెండువేల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఆదివారం నుంచి హెల్మెట్లు ధరించటం తప్పనిసరి కావటంతో షాపులవారు చెప్పిన ధరలకే హెల్మెట్లు కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత లేని హెల్మెట్లు వాడకూడదని పోలీసులు సూచిస్తున్నా రోడ్డుపక్కన విక్రయించే అనామక హెల్మెట్ల విక్రయం కూడా జోరుగా జరుగుతోంది. మరోవైపు నాలుగు చక్రాల వాహనం నడిపే వారు విధిగా సీటు బెల్టు ధరించాలన్న నిబంధన కూడా నేటి నుంచి అమలుకానుంది. జిల్లాలో చిరుజల్లులు * అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు ఆంధ్రభూమి బ్యూరో విజయనగరం, అక్టోబర్ 31 ఈశాన్య రుతుపవనాల ప్రభావం గడచిన రెండురోజులుగా జిల్లాలో కనపడుతోంది. రెండురోజుల కిందటి వరకు ఎండవేడితో జనాలు ఇబ్బందులు పడుతుండగా, శుక్రవారం నుంచి ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వాతావరణం చల్లబడింది. జిల్లాలోని ఒకటి, రెండుచోట్ల శుక్రవారం చిరుజల్లులు కురిసాయి. శనివారం ఉదయం నుంచి జిల్లావ్యాప్తంగా చల్లటిగాలులు వీయటంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. సాయంత్రం నుంచి విజయనగరం పట్టణంలో ఒకమోస్తరు కురుస్తోంది. నెల్లిమర్ల, భోగాపురం, పూసపాటిరేగ శృంగవరపుకోట, కొత్తవవలస, వేపాడ ప్రాంతాల్లో సాధారణ వర్షం కురుస్తోంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటిస్తుండటంతో ఖరీఫ్ సీజన్‌లో ముందస్తుగా వరిపంట వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వారం, పదిరోజుల్లో పంటకోతకు వస్తున్న తరుణంలో వర్షాలు కురిస్తే పంట దెబ్బతిని తాము భారీగా నష్టపోవలసి వస్తుందని రైతులు చెబుతున్నారు. అవసరమైనంత ఇసుక * ఆర్డర్లకు తగినంత సరఫరా: కలెక్టర్ నాయక్ ఆంధ్రభూమి బ్యూరో విజయనగరం, అక్టోబర్ 31: జిల్లాలో వినియోగదారులకు అవసరమైన ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంఎం నాయక్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 50ఇసుక రీచ్‌లు ఉన్నా, సెప్టెంబర్ నెలలో కురిసిన వర్షాలకు కొన్ని రీచ్‌లు మునిగిపోయిన కారణంగా ఇసుక తవ్వకాలు, సరఫరాలో ఇబ్బందులు కలగడాన్ని ప్రస్తావిస్తూ మునిగిన రీచ్‌ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఇసుక తవ్వకాలు, రవాణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు ఇసుక రీచ్‌లు మునిగిన కారణంగా పెండింగ్‌లో ఉన్న ఇసుక సరఫరా ఆర్డర్లను రెండు, మూడురోజుల్లో క్లియర్ చేసి, ఆ తరువాత ఆర్డర్ ప్రకారం ఇసుక సరఫరా ఏరోజుకు ఆరోజు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. డెంకాడ, కోటగండ్రేడు, గోపాలపల్లి, వేములపల్లి, విజనగిరి, జామి, బిట్రపాడు తదితర ఇసుక రీచ్‌లలో పెండెన్సీ ఎక్కువగా ఉందని చెబుతు, ఈ రీచులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ఎక్కువ మొత్తంలో ఇసుక అవసరమైన వారి వివరాలను తమకు తెలిపితే, దానికి ఇసుక అందుబాటులో ఉన్న ఇసుక రీచుల నుంచి వారికి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఆయా ఇసుక రీచ్‌ల వద్ద 5.51లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్నందున నిర్మాణదారులు ఇసుక విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రమణ, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ ఢిల్లీరావు, జిల్లా పంచాయతీ అధికారి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు

Saturday, October 31, 2015

అణు ఆయుధాలతో పాక్ పన్నాగం

అణు ఆయుధాలు ఉండేది పండగ చేసుకోవడానికి కాదు ఇది ఆనాటి మాట..ప్రపంచాన్నే వణికించిన ఆల్ కాయిదా ఉగ్రవాదులు మా హీరోలు ఇది నేటి మాట..ఇంతకీ ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా..పాకిస్తాన్ అనే సామ్రాజ్యాన్ని ఒకప్పుడు ఏలిన అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. పాకిస్తాన్ బలహీన దేశం కాదని..మా దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని దాడికి ఎప్పుడైనా మేము సిధ్ధమని నాడు చెప్పిన ముషారఫ్ నేడు ఉగ్రవాదమనే పాముకు పాలు పోసి పెంచింది మేమేనని వాస్తవాలను వెల్లడించారు. ఉగ్రవాదులే మా హీరోలని ప్రపంచాన్ని నాశనం చేయడానికే వారిని తయారు చేశామని చెబుతున్నారు. ప్రపంచానికే షాక్ నిస్తున్న ముషారప్ మాటల కథనం స్లైడర్ లో....   అమెరికా ఉగ్ర దాహానికి లక్షల మంది బలి ఉగ్రవాదానికి పాక్ ప్రభుత్వం అందించిన అండదండల బండారం .. పాక్‌కు చెందిన దునియా న్యూస్ చానల్‌కు మాజీ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉగ్రవాదానికి పాక్ ప్రభుత్వం అందించిన అండదండల బండారం బయటపెట్టారు. 1990లో కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమం మొదలైనప్పుడు.. లష్కరేతాయిబా సహా 11 లేదా 12 ఉగ్రవాద సంస్థలు ఏర్పడ్డాయి. వాటికి పాక్ ప్రభుత్వం, సైన్యం పూర్తిగా సహకరించింది. ఆ సంస్థల్లో చేరిన యువకులకు శిక్షణ ఇచ్చాం.. వారు సరిహద్దులు దాటేందుకు సహకరించాం అని పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వం సర్వ సౌకర్యాలు సమకూర్చుతున్నది ... 2008 ముంబై ఉగ్రదాడి మాస్టర్‌మైండ్స్ సయీద్, లఖ్వీపై పాక్ చర్యలు తీసుకుంటుందా..? అని ప్రశ్నించగా భారత్‌కు సయీద్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కానీ, పాక్‌లో యథేచ్ఛగా తిరుగడమే కాకుండా.. విద్వేష ప్రసంగాలు చేస్తున్నాడు. ఇందుకు పాక్ ప్రభుత్వం సర్వ సౌకర్యాలు సమకూర్చుతున్నది అని ముషారఫ్ వెల్లడించారు. హఫీజ్ సయీద్, లఖ్వీలను హీరోలుగా ఆరాధించామని.. కశ్మీర్ స్వేచ్ఛకోసం పోరాడిన హఫీజ్ సయీద్, లఖ్వీలను హీరోలుగా ఆరాధించామని, ఆ తర్వాత మత పోరాటం (జిహాద్) ఉగ్రవాదంగా మారిందని చెప్పారు. ఇప్పుడు వాళ్లు (పాక్‌లోని ఉగ్ర మూకలు) సొంత ప్రజలనే చంపుతుండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.సయీద్, లఖ్వీని కూడా పాక్ నియంత్రిస్తుందా..? అని మీడియా అడిగిన ప్రశ్నకు ముషారఫ్ సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ఆఫ్ఘన్‌లో సోవియట్ రష్యా సైనిక దళాలను ఎదుర్కొనేందుకు పన్నిన వ్యూహం.. మత పోరాటం (జిహాద్).. 1979లో ఆఫ్ఘన్‌లో సోవియట్ రష్యా సైనిక దళాలను ఎదుర్కొనేందుకు పన్నిన వ్యూహం.. నేడు ప్రపంచాన్నే వణికిస్తున్న ఉగ్రవాదంగా మారింది అని చెప్పారు. రష్యా దళాలపై పోరాటానికి తాలిబన్లకు మేమే సైనిక శిక్షణ ఇచ్చాం. తాలిబన్, హక్కానీ, ఒసామా బిన్ లాడెన్, అల్ జవహరి మాకు హీరోలు. ఆ తర్వాత విలన్లుగా మారారు అని తెలిపారు. 1990ల్లో కశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలను సృష్టించి.. కశ్మీర్‌లో మత తీవ్రవాదాన్ని రెచ్చగొట్టేందుకు లష్కరే తోయిబాతో పాటు పలు ఉగ్రవాద సంస్థలకు శిక్షణతోపాటు పూర్తి మద్దతిచ్చినట్లు పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తెలిపారు. పాక్ మాజీ మిలటరీ చీఫ్ కూడా అయిన ముషార్రఫ్ 1990ల్లో కశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలను సృష్టించి, శిక్షణ ఇచ్చినట్లు ఓ టీవీ చానల్‌తో అన్నారు. హఫీజ్ సయీద్, లఖ్వీ తదితరులను పాక్ ప్రజలు హీరోలుగా ఉగ్రవాద నాయకులైన లాడెన్, హక్కానీ, అల్ జవహరీ, లష్కరే నాయకులు హఫీజ్ సయీద్, లఖ్వీ తదితరులను పాక్ ప్రజలు హీరోలుగా గుర్తించారన్నారు.'1990ల్లో 'స్వతంత్ర కశ్మీర్' ఉద్యమం మొదలైనప్పుడు లష్కరేతోపాటు 11, 12 చిన్న చిన్న తీవ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రాణాలకు తెగించి పోరాడేలా వారికి శిక్షణతో పాటు పూర్తి మద్దతిచ్చాం. మతతీవ్రవాదం కోసం వారిని పుట్టిస్తే.. అదే ఇప్పుడు ఉగ్రవాదమై మన వారినే చంపుతోంది. అందుకే దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది' అన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. భారత్‌ చేస్తున్న వాదనకు ముషారఫ్‌ వ్యాఖ్యలు .. అయితే పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ చేసినవ్యాఖ్యలు భారత్‌ కంటే ఆయన దేశానికే ఎక్కువ ఆశ్చర్యం కలిగించి వుంటాయి. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్‌ అండదండలున్నాయనీ, భారత్‌ చేస్తున్న వాదనకు ముషారఫ్‌ వ్యాఖ్యలు కొండంత బలాన్నిచ్చాయి. నిరాధారమైన ఆరోపణలంటూ అంతర్జాతీయ వేదికలమీద ఇంతకాలమూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్‌ను ఆయన వ్యాఖ్యలు ఇరకాటంలో పడేశాయి. ఒసామా బిన్‌ లాడెన్‌ తమ దేశంలో ఆశ్రయం పొందుతున్నట్టు .. ఒసామా బిన్‌ లాడెన్‌ తమ దేశంలో ఆశ్రయం పొందుతున్నట్టు తమ పాలకులకూ, నిఘా వ్యవస్థలకు మొదటినుంచీ తెలుసునంటూ ఇటీవలే భారత్‌కు చెందిన చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్‌ మాజీ రక్షణమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వారిలో ముషారఫ్‌ కూడా ఉన్నారు. స్పష్టమైన వివరణ ఇచ్చుకోవాలంటూ పాకిస్థాన్‌ ప్రభుత్వం .. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలనీ, లేదా స్పష్టమైన వివరణ ఇచ్చుకోవాలంటూ పాకిస్థాన్‌ ప్రభుత్వం కూడా ఆగ్రహించింది. ఇప్పుడు సాక్షాత్తూ ఆ దేశ మాజీ అధ్యక్షుడు తాలిబాన్‌ ఆవిర్భావం నుంచి నేటివరకూ పాకిస్థాన్‌ నిర్వహించిన ఉగ్రవాద పాత్రను విప్పిచెప్పడం ద్వారా తన దేశానికి కాకున్నా తనకు మేలు చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. ముషారఫ్‌ ప్రస్తుతం అనేక కేసుల్లో.. ముషారఫ్‌ ప్రస్తుతం అనేక కేసుల్లో ఇరుక్కుని ఉన్నారు. బెనజీర్‌ భుట్టో హత్యకేసు ఆయనను వెంటాడుతున్నది. కొద్దిరోజుల క్రితమే అమెరికన్‌ పాత్రికేయుడు సీగల్‌ ఈ కేసు విచారిస్తున్న రావల్పిండి కోర్టుకు బేనజీర్‌ భుట్టోను ముషారఫ్‌ బెదిరించిన ఫోన్‌కాల్‌ వీడియో లింకేజ్‌ను పంపడంతో ముషారప్ మరింత ఇరకాటంలో పడ్డారు. లాల్‌ మసీదుపై జరిగిన దాడి.. భుట్టో హత్యకు సూత్రధారి ముషారఫ్‌ మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. దీనితోపాటుగా, లాల్‌ మసీదుపై జరిగిన దాడి, ఒక ముస్లిం మతపెద్ద హత్య కేసులోనూ ముషారఫ్‌ ఇరుక్కున్నారు. ఈ నేపథ్యంలో, డెబ్పైరెండేళ్ళ వయసులో ఒక కొత్త రాజకీయపార్టీతో మరోప్రస్థానం ఆరంభించాలనుకుంటున్న ముషార్‌ఫకు ప్రజలతో పాటు, పాకిస్థాన్‌లోని వివిధవర్గాల వారిని ఆకట్టుకోవలసిన అవసరం ఉండవచ్చు. బాల్‌ థాకరేమీద కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు .. పాకిస్థాన్‌ నాయకులను, కళాకారులను అవమానిస్తూ, భారత్‌లోని మైనారిటీ ముస్లింలపై తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నదంటూ శివసేన వ్యవహారశైలిపై అంతర్జాతీయస్థాయిలో ప్రచారం చేయాలని పాకిస్థాన్‌ ప్రభుత్వం సంకల్పిస్తున్న నేపథ్యంలో ముషారఫ్‌ బాల్‌ థాకరేమీద కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ని వెనకేసుకొస్తూ, బాల్‌ థాకరే పేరు ప్రస్తావించారు. వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం ముషార్‌ఫకు .. వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం ముషార్‌ఫకు కొత్తకాదు కానీ, భారత్‌ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్‌ ఆదినుంచీ అండగా ఉన్నదని అంగీకరించడం మాత్రం ఇదే ప్రధమం. ఇటువంటి వ్యాఖ్యలు ఎవరో సాదాసీదా వ్యక్తుల నుంచి వచ్చివుంటే వాటికి ప్రాధాన్యం ఉండివుండేది కాదు. పదేళ్ళపాటు పాకిస్థాన్‌ను ఏలిన వ్యక్తి .. కానీ, అత్యంత కీలకమైన సందర్భంలో పదేళ్ళపాటు పాకిస్థాన్‌ను ఏలిన వ్యక్తి ఆయన. సైనిక నియంతగా పాకిస్థాన్‌లోని సర్వ వ్యవస్థలనూ తన నియంత్రణలో ఉంచుకున్న వ్యక్తి. అధికారంలోకి రాకముందు కూడా భారత్‌తో వ్యవహరించే విషయంలో పాకిస్థాన్‌ పాలకులను పూర్తిగా నియంత్రించిన వ్యక్తి. పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలకు నెలవుగా.. పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలకు నెలవుగా, శిక్షణాకేంద్రంగా పనిచేసిందని ఆయన ఒప్పుకోలు ఇంతకాలమూ పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్‌ చేస్తున్న వాదనకు ఎనలేని బలాన్ని చేకూర్చింది. ముషారఫ్‌ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికలమీద పాకిస్థాన్‌ వ్యవహారశైలిని బలంగా ఎండగట్టడానికే కాదు, దావూద్‌ వంటివారి విషయంలో కఠినంగా వ్యవహరించాలనుకుంటున్న భారత్‌కు అనూహ్యంగా అందివచ్చిన ఆయుధంగానూ ఉపకరిస్తాయి. పాకిస్తాన్ తో పెట్టుకోవద్దని భారత్ కు సవాల్.. అయితే ఆయన ఇంతకు ముందు సైతం పాకిస్తాన్ తో పెట్టుకోవద్దని భారత్ కు సవాల్ విసిరాడు. పాకిస్తాన్ భూభాగంలోకి భారత్ ప్రవేశించాలని చూస్తే పాకిస్తాన్ చూస్తూ ఊరుకోదు..మేము చిన్న పిల్లలం కాదంటూ కుండబద్దలు కొట్టారు. పాక్ బలహీన దేశం కాదని .. పాకిస్తాన్ తో దాడికి దిగొద్దని పాక్ బలహీన దేశం కాదని అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని మయన్మార్ లాంటిది కాదని మా దగ్గర దాదాపు అణు ఆయుధాలు ఉన్నాయని మన దేశానికి వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. 2020 కల్లా వీటిని 200లకు పెంచడమే తమ లక్ష్యమని... 2020 కల్లా వీటిని 200లకు పెంచడమే తమ లక్ష్యమని కాబట్టి మాతో గేమ్స్ ఆడేందుకు ట్రై చేయవద్దని ఆయన అన్నారు. మరి ఇప్పుడు ఉగ్రవాదంపై కూడా తనదైన శైలిలో చెప్పారు...దీనిపై ప్రపంచదేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ముఖ్యంగా భారత్ ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి.

Saturday, September 26, 2015

కొత్త పంచాయితీ..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 20,21 ప్రతి వ్యక్తికీ తన ఆహార అలవాట్లతో పాటు అన్ని హక్కులకూ హామీ ఇచ్చింది. ప్రతి వ్యక్తికీ తనదైన ఆహరపుటలవాట్లు కలిగి ఉండి, నచ్చినది తినే హక్కు ఉన్నది. దీన్ని ఎవరు ఏ రూపంలో నియంత్రించినా వ్యక్తి స్వేచ్ఛకు భంగకరమేగాక, రాజ్యాంగ ఉల్లంఘనగా చెప్పక తప్పదు. కానీ మన పాలకులు ఏదో ఒక సాకుతో పశు వధను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల పదిహేడవ తేదీన మాంసాహార అమ్మకం మీద ఉన్న నిషేధంపై బొం బాయి హైకోర్టు స్టే విధించడంతో ఈ వివాదానికి తాత్కాలిక తెర పడ్డది. అయితే ఆ రోజున కబేళాలు పనిచేయకూడదని, అమ్మకం సాగించ వచ్చునని న్యాయస్థానం స్పష్టం చేసింది. జైన పర్వదినమైన పర్యూషణ్ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం మాంస విక్రయాన్ని నిషేధించడంపై కొద్ది రోజులుగా వివాదం సాగుతున్నది. బీజేపీ మొదట వారం రోజుల నిషేధం విధించాలని భావించింది. కానీ మిత్రపక్షమైన శివసేన నుంచే వ్యతిరేకత వచ్చింది. దాంతో నాలుగు రోజులకు కుదించింది. అయినప్పటికీ వివాదం చల్లారలేదు. మాంస విక్రయందారుల పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు అమ్మకానికి అనుకూలంగా స్పందించింది. ఈ కేసులో వాదోపవాదాలు సాగుతున్నప్పుడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు గమనార్హమైనవి. ముంబయి ప్రగతిశీలమైనదనే భావన ఉన్నది. కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు తిరోగమనమైనవి అని కోర్టు వ్యాఖ్యానించింది. మేం (జైనుల) మనోభావాలను అర్థం చేసుకుంటు న్నాం. కానీ కొనుగోలు అనేది ఇష్టాన్ని బట్టి ఉంటుంది అని కోర్టు హితవు చెప్పింది. ఇంతకాలం మీరు పశువధపై నిషేధం విధించారు, కానీ మాంస విక్రయంపై కాదు అని న్యాయ స్థానం గుర్తు చేసింది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన ధోరణిని మార్చుకోవాలని, ముంబయి ఆధునిక నగరమనీ, వరుసగా ఎనిమిది రోజుల నిషేధం తగదని కూడా సూచించింది. మాంసాహారం, శాకాహా రం అనేది ఆయా వ్యక్తుల ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఏది మంచిదనే చర్చ కాదు. పౌరుల స్వేచ్ఛ, హక్కులకు సంబంధించిన అంశమిది.మాంసాహారంపై ఈ మధ్య వివాదం చెలరేగడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనేది స్పష్టం. నిజానికి మహారాష్ట్రలో ఈ నిషేధం మొదలైంది 1994లో కాంగ్రెస్ హయాంలోనే. పదేండ్ల తరువాత రెండు రోజుల నిషేధాన్ని నాలుగు రోజులకు పొడిగించారు. అయితే ఈ నిషేధం కాగితాలకే పరిమితం అయింది తప్ప ఆచరణలో లేదు. ఇక దేశ వ్యాప్తంగా పరిస్థితిని గమనిస్తే సంఘపరివార్ ప్రబోధాలు, బీజే పీ ప్రభుత్వ విధానాలు ఈ వివాదాన్ని మరింత ముదరగొడుతున్నాయి. రెండు దశాబ్దాలుగా ఏదో రూపం లో పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత తమ మెజారిటీ వాద విధానాలను ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. మొత్తం సమాజాన్ని హైందవీకరణ చేసే పని ని చాపకింది నీరులా చేసుకుంటూ పోతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, గుజారాత్, హర్యానా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఆయా ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. అయి తే ఈ సారి మహారాష్ట్ర ప్రభుత్వం జైనుల మతపరమై న పర్యూషణ ఉత్సవాలను సాకుగా తీసుకుని మాం సం అమ్మకాల నిషేధాన్ని తెరమీదికి తెచ్చింది. అంతే కాదు ముంబాయి శివారు ప్రాంతాల్లో కూడా గోమాంస అమ్మకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా గోమాంసాన్ని విక్రయించినా, గోవధకు పాల్పడ్డా ఐదేళ్ల జైలు శిక్ష, లేదా పదివేల రూపాయల జరిమానా విధిస్తారు. పశువధ, మాంస విక్రయాల నిషేధం మొగలు రాజు అక్బర్ కాలంనుంచీ అమలులో ఉన్నదని సంఘ పరివార్ పెద్దలు చెప్పుకొస్తున్నారు! దానికి తోడు ఇతిహాసాలు, పురాణాల్లో గోవును పవిత్రమైనదిగా చెప్పిన విషయాలను చెప్పుకొస్తూ నిషేధాన్ని సమర్థించుకుంటున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20,21 ప్రతి వ్యక్తికీ తన ఆహార అలవాట్లతో పాటు అన్ని హక్కులకూ హామీ ఇచ్చింది. ప్రతి వ్యక్తికీ తనదైన ఆహరపుటలవాట్లు కలిగి ఉండి, నచ్చినది తినే హక్కు ఉన్నది. దీన్ని ఎవరు ఏరూపంలో నియంత్రించినా వ్యక్తి స్వేచ్ఛకు భంగకరమేగాక, రాజ్యాంగ ఉల్లంఘనగా చెప్పక తప్పదు. కానీ మన పాలకులు ఏదో ఒక సాకుతో పశు వధను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే గోవధ చేశారని మహారాష్ట్రలో ముగ్గురిని అరెస్టు చేశారు. సంబంధిత అవసరమైన పత్రాలన్ని ఉన్నా గోవులను తీసుకు పోతున్న పది లారీలను రాష్ట్ర సరిహద్దుల్లోనే నిలిపేశారు. అంతే కాదు, మహారాష్ట్ర మంత్రి ఒక అడుగు ముందుకేసి గోవధపై ఆధారపడే వారంతా.. ఆవుపేడను, ఆవు మూత్రాన్ని అమ్ముకొని బతకాలని సూచించడంలోని హేళననూ, వారంటే అతనికున్న ఛీత్కారభావాన్ని పసిగట్టవచ్చు. ప్రజల్లో ఐక్యతను, జీవన ప్రమాణాలను పెంచేందుకు మాత్రమే పాలనా విధానాలు ఉండాలి. మెజారిటీ వాదం, ఆధిపత్య విధానాలతో ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయకుండా చూడాల్సిన బాధ్యత అందరిది. భిన్న మతాలు, జాతుల సమ్మేళనంగా తరతరాలుగా భిన్నత్వంలో ఏకత్వంగా సహజీవనం చేస్తున్న ప్రజల్లో విభజన రేఖలు గీసే చర్యలు ప్రమాదకరమైనవి.

స్వచ్ఛ భారత్ కు మరింత ఊపు


కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు మరింత ఊపు తేవాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు స్వచ్ఛ భారత్‌ ను కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించేందుకు కేంద్ర స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. స్వచ్ఛ భారత్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంపై సమావేశమైన కేంద్రమంత్రులు, కార్యదర్శుల బృందం .. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. భేటీలో ఆమోదించిన ప్రణాళికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు పంపించింది.


Saturday, August 8, 2015

కొత్త సూయెజ్‌ కాల్వ ప్రారంభం

kotta suyej kaalva praarambham


మధ్యధరా సముద్ర ప్రాంతంలో కొత్తగా నిర్మించిన సూయెజ్‌ కాల్వను ఈజిప్ట్‌ అధికారికంగా ప్రారం భించింది. కొత్త జలమార్గంలో నౌకాయానాన్ని అనుమతిస్తూ సూయెజ్‌ కెనాల్‌ అథారిటీ అందచేసిన పత్రాలపై ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌ శిశి సంతకం చేయటంతో ఈ కొత్త జలమార్గాన్ని లాంఛనంగా ప్రారంభించినట్లయింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తాను ఈజిప్ట్‌ అధ్యక్షుడిగా కొత్త సూయెజ్‌ కాల్వలో కార్యక లాపాలను ప్రారంభించేందుకు అనుమతినిస్తున్నానని అన్నా రు. ఆయన ప్రసంగం కొనసాగుతున్న సమయంలో రెండు భారీ నౌకలు ఈ జలమార్గంలో విభిన్న దశల్లో పయనిస్తుం డటంపై హాజరైన వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేయటంతో శిశి తన ప్రసంగాన్ని కొద్దిసేపు నిలిపివేశారు. ఈ ప్రాజెక్టుకు గత ఏడాది ఆగస్టు 6న అనుమతించిన శిశి దీనిని సరిగ్గా ఏడా ది కాలంలో పూర్తి చేయాలని షరతు విధించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏడాదిలోగా పూర్తి చేసి సరిగ్గా ఆగస్టు 6వ తేదీ నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయటం విశేషం. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని 120 దేశాలకు చెందిన దాదాపు 800 మంది నేతలు, సీనియర్‌ అధికారులు హాజరయ్యారు. వీరిలో ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హాలెండే, జోర్డాన్‌ రాజు అబ్దుల్లా, బెహ్రెయిన్‌ రాజు హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా తదితరులున్నారు.

మొబైల్ డేటా డీయాక్టివేషన్ ప్రక్రియను 1925 నంబరుకి (టోల్ ఫ్రీ) కాల్ చేసినా లేదా ఎస్‌ఎంఎస్ చేసినా సరిపోతుంది


మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ సర్వీసులను యాక్టివేట్/డీయాక్టివేట్ చేసుకోదల్చుకున్నవారి కోసం సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యేక నంబరు అందుబాటులోకి వస్తోంది. దీనికోసం ఇకపై 1925 నంబరుకి (టోల్ ఫ్రీ) కాల్ చేసినా లేదా ఎస్‌ఎంఎస్ చేసినా సరిపోతుంది. అదనపు ఆదాయం పొందే ఉద్దేశంతో టెలికం సంస్థలు మొబైల్ డేటా డీయాక్టివేషన్ ప్రక్రియను చాలా సంక్లిష్టంగా మార్చేస్తున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రాయ్ ఈ మేరకు చర్యలు తీసుకుంది.

టెలికం ఆపరేటర్లు డేటా యాక్టివేషన్/డీయాక్టివేషన్‌కి సెప్టెంబర్ 1 నుం చి 1925 నంబరును అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. యాక్టివేషన్ కావాలనుకునేవారు ఇంగ్లీషులో స్టార్ట్ అని, డీయాక్టివేషన్ చేసుకోదల్చుకున్నవారు స్టాప్ అని ఈ నంబరుకు ఎస్‌ఎంఎస్ చేయొచ్చు. టెలికం ఆపరేటర్లు తక్షణమే సదరు సర్వీసు పరిస్థితి గురించి కస్టమరుకు తెలియజేయాల్సి ఉంటుంది.

 కొత్త నిబంధనల ప్రకారం 500 ఎంబీ, 1జీబీ, 2జీబీ తదితర డేటా పరిమితుల దాకా యూజరు ముందస్తుగా ఇచ్చిన సమ్మతి వర్తిస్తుంది. నిర్దేశిత పరిమితి దాటితే ప్రత్యేకంగా అనుమతి ఉండాల్సిందే. ఇక స్పెషల్ టారిఫ్ వోచర్లు (ఎస్‌టీవీ) లేదా కాంబో వోచర్ లేదా యాడ్ ఆన్ ప్యాక్ వంటి డేటా ప్యాక్‌లు తీసుకున్న వారు డేటా సర్వీసుల కోసం తమ అనుమతి ఇచ్చినట్లుగానే భావించడం జరుగుతుంది. డేటా ప్యాకేజీ కోసం సబ్‌స్క్రయిబ్ చేయకపోయినప్పటికీ.. అవసరాన్ని బట్టి వినియోగించుకునే వారికి ప్రతి 10 ఎంబీ డేటా విని యోగం తర్వాత టెల్కోలు అలర్ట్‌లు పంపాల్సి ఉంటుంది. కస్టమర్లు అంతర్జాతీయంగా రోమిం గ్‌లో ఉన్న సమయంలో డేటాను గానీ వినియోగించుకోకుండా ఉన్న పక్షంలో హ్యాండ్‌సెట్‌లో మొబైల్ ఇంటర్నెట్ సర్వీస్‌ను స్విచ్ ఆఫ్ చేయాలంటూ అలర్ట్ చేయాల్సి ఉంటుంది.

Thursday, August 6, 2015

వామ్మో..! శవంతో ఐదు సంవత్సరాలుగా నిద్ర..!


vaammo..! shavanto aidu samvatsaraaluga nidra..!




ప్రేమ గుడ్డిది అంటారు..ఇద్దరి మద్య ప్రేమ ఏర్పడితే... అది స్వచ్చమైనది అయితే దాన్ని ఎవరూ విడదీయలేరు..చరిత్రలో ప్రేమకథలు ఎన్నో ఉన్నాయి రోమియో-జూలియట్, లైలా-మజ్నూ, ఇక షాజాహాన్ అయితే తన భార్య కోసం తాజ్ మహల్ కట్టించి ఇచ్చి తన ప్రేమను చాటాడు. ప్రపంచంలో ప్రేమ చరిత్రలు చాలా ఉన్నాయి. తాజాగా వియాత్నంలో ఒక వ్యక్తి చేసిన వింత సంఘటన భయకంపితుల్ని చేస్తున్నా మరో పక్క ఆయన ప్రేమ ఎంత గొప్పదో కినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే.. 2003 లో వియత్నాంలో క్వాంగ్ నామ్ ప్రావిన్స్ వద్ద ఒక 55 ఎళ్ల వ్యక్తి భార్య చనిపోయింది. మనిషి అన్న తర్వాత పుట్టుట, గిట్టుట సహజం కానీ ఆమె భర్త మటుకు అలా అనుకోలేదు తమను అర్ధాంతరంగా విడిచి వెళ్లిపోయిందని రోదించాడు.. తన భార్య వెంట తనూ చావలేక ఆమెతో జ్ఞాపకాలను మర్చిపోలేక ఆమె సమాది వద్ద 20 నెలలు గడిపాడు.. ప్రకృతి అన్న తర్వాత గాలీ,వానా వస్తాయి కదా అలా ఆయన సమాది వద్ద ఉండగా ఎప్పుడూ గాలి, వానా తో ఇబ్బద్ది పడుతున్నాట్టుగా భావించి ఒక ఆలోచన ఆలోచించాడు. 2004 లో తన భార్య సమాదిని తవ్వి ఆమె హస్తికలు శరీర భాగాన్ని తీసి వాటిని కాగితం మరియు ఒక మట్టి అచ్చు శరీరంలా తయారు చేశాడు. ఇక ముఖానికి ఒక మాస్క్ ను ఏర్పాటు చేశాడు అంతే కాదు ఆమె శరీరానికి ఒక డ్రెస్ కూడా వేశాడు. ఇక ఇంట్లో చనిపోయిన భార్య పక్కన నిద్ర పోవడం ఆరంభించాడు. అలాగా తనయుడు కూడా ఇలా ఐదు సంవత్సరాలుగా వాళ్లు అలాగే చేస్తు వచ్చారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Wednesday, July 29, 2015

తెలంగాణలో మళ్లీ తెరపైకి గ్రూప్‌-3 పోస్టులు


తెలంగాణలో మళ్లీ తెరపైకి గ్రూప్‌-3 పోస్టులు
గ్రూప్‌-2లోని నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు
ఆ ఖాతాలోకి.. వాటికీ ఇంటర్వ్యూలు
వయోపరిమితి సడలింపు ఐదేళ్లే
గ్రూప్‌-4 యథాతథం.. సబ్‌ కమిటీ సిఫారసు
గ్రూప్‌-1లో ఆరో పేపర్‌.. టీ ఉద్యమ చరిత్ర చేర్పు
ఇంటర్వ్యూకు 25 మార్కులు పెంపు
వెయ్యి మార్కులతో మెయిన్స్‌
హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ‘‘1..2..3..4’’! ఆ తర్వాత మధ్యలో ‘3’ పోయి ‘1..2..4’ మాత్రమే మిగిలాయి. మళ్లీ ఇప్పుడు 3 చేరింది. మొన్న మొన్నటిదాకా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 కేటగిరీల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో గ్రూప్‌-3 చేరింది. ఈ కేటగిరీని మళ్లీ చేర్చాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది. గ్రూప్‌-2లోని నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌-3లో చేర్చింది. ఈ గ్రూప్‌లోని పోస్టులకూ ఇంటర్వ్యూలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ భర్తీ చేసే పోస్టుల స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌పై ప్రభుత్వం నియమించిన కేబినెట్‌ సబ్‌ కమిటీ బుధవారం చివరి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు సి.లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నియామకాల్లో అనుసరించాల్సిన అంశాలపై ప్రభుత్వానికి కమిటీ పలు కీలక సిఫారసులు చేసింది. గతంలో ఉద్యోగాల్లో గ్రూప్‌1, 2, 3, 4 కేటగిరీలు ఉండేవి. అయితే కాల క్రమంలో గ్రూప్‌-3ని రద్దు చేసి ఆ పోస్టులను గ్రూప్‌-2ఎ, బిలుగా విభజించారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను ‘బి’లో చేర్చారు. ఆ తర్వాత ‘ఏ, బీ’లను రెండింటినీ రద్దు చేసి.. ఎగ్గిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను ఒకే చెట్టు కిందకు తీసుకొచ్చారు. అంటే గ్రూప్‌-2 ద్వారానే రెండు రకాల పోస్టుల నియామకాలు చేపట్టారు. ప్రస్తుతం కేబినెట్‌ సబ్‌ కమిటీ మళ్లీ కొత్తగా గ్రూప్‌-3ని తెరపైకి తెచ్చింది. గ్రూప్‌-3 ద్వారా ఎంపికయ్యే ఉద్యోగి తన సామర్థ్యాన్ని బట్టి కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌ స్థాయి వరకు పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేవలం రాత పరీక్ష ఆధారంగా నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు నియామకాలు చేపట్టడం సబబు కాదని భావించిన కేబినెట్‌ సబ్‌కమిటీ ఇంటర్వ్యూలను నిర్వహించాల్సిందేనని అభిప్రాయపడింది. ఇక, గ్రూప్‌-2 ద్వారా కేవలం ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్‌-1లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే మెయిన్స్‌లో అదనంగా ఓ పేపర్‌ను చేర్చారు. మార్కులు పెంచారు. గ్రూప్‌-4 ఉద్యోగాలను మాత్రం పాతపద్ధతిలోనే భర్తీ చేయనున్నారు. గ్రూప్‌-2, 3, 4 పరీక్షలను ఆబ్జెక్టివ్‌ పద్ధతిలోనే నిర్వహిస్తారు. జూనియర్‌ లెక్చరర్ల పోస్టులకు మాత్రం ఆబ్జెక్టివ్‌, డిస్ర్కిప్టివ్‌, ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు చేపడతారు. నిరుద్యోగుల వయో పరిమితిని ఐదేళ్లు సడలించాల్సిందిగా కేబినెట్‌ సబ్‌కమిటీ సిఫారసు చేసింది. ప్రతిపక్షాలు ఒప్పుకొంటే పదేళ్లయినా సడలిస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ గతంలో ప్రకటించారు. కానీ సబ్‌ కమిటీ మాత్రం ఐదేళ్లకు సిఫారసు చేసింది.

Saturday, May 2, 2015

Civil Service aspirants request for changes in CSAT


Civil Service aspirants request for changes in CSAT


తెలంగాణలో తొలి ఉద్యోగ నోటిఫికేషన్‌కు ఉత్తర్వులు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి తొలి నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటర్ గ్రిడ్ పథకం సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. . 418 అసిస్టెంట్ ఇంజినీర్లు, 125అసిస్టెంట్ ఇంజినీర్లను రిక్రూట్ చేయనున్నారు.


Followers