తెలంగాణలో మళ్లీ తెరపైకి గ్రూప్-3 పోస్టులు
గ్రూప్-2లోని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఆ ఖాతాలోకి.. వాటికీ ఇంటర్వ్యూలు
వయోపరిమితి సడలింపు ఐదేళ్లే
గ్రూప్-4 యథాతథం.. సబ్ కమిటీ సిఫారసు
గ్రూప్-1లో ఆరో పేపర్.. టీ ఉద్యమ చరిత్ర చేర్పు
ఇంటర్వ్యూకు 25 మార్కులు పెంపు
వెయ్యి మార్కులతో మెయిన్స్
హైదరాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ‘‘1..2..3..4’’! ఆ తర్వాత మధ్యలో ‘3’ పోయి ‘1..2..4’ మాత్రమే మిగిలాయి. మళ్లీ ఇప్పుడు 3 చేరింది. మొన్న మొన్నటిదాకా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 కేటగిరీల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో గ్రూప్-3 చేరింది. ఈ కేటగిరీని మళ్లీ చేర్చాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. గ్రూప్-2లోని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-3లో చేర్చింది. ఈ గ్రూప్‌లోని పోస్టులకూ ఇంటర్వ్యూలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసే పోస్టుల స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌పై ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ బుధవారం చివరి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు సి.లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నియామకాల్లో అనుసరించాల్సిన అంశాలపై ప్రభుత్వానికి కమిటీ పలు కీలక సిఫారసులు చేసింది. గతంలో ఉద్యోగాల్లో గ్రూప్1, 2, 3, 4 కేటగిరీలు ఉండేవి. అయితే కాల క్రమంలో గ్రూప్-3ని రద్దు చేసి ఆ పోస్టులను గ్రూప్-2ఎ, బిలుగా విభజించారు. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ‘బి’లో చేర్చారు. ఆ తర్వాత ‘ఏ, బీ’లను రెండింటినీ రద్దు చేసి.. ఎగ్గిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఒకే చెట్టు కిందకు తీసుకొచ్చారు. అంటే గ్రూప్-2 ద్వారానే రెండు రకాల పోస్టుల నియామకాలు చేపట్టారు. ప్రస్తుతం కేబినెట్ సబ్ కమిటీ మళ్లీ కొత్తగా గ్రూప్-3ని తెరపైకి తెచ్చింది. గ్రూప్-3 ద్వారా ఎంపికయ్యే ఉద్యోగి తన సామర్థ్యాన్ని బట్టి కన్‌ఫర్డ్ ఐఏఎస్ స్థాయి వరకు పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేవలం రాత పరీక్ష ఆధారంగా నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నియామకాలు చేపట్టడం సబబు కాదని భావించిన కేబినెట్ సబ్‌కమిటీ ఇంటర్వ్యూలను నిర్వహించాల్సిందేనని అభిప్రాయపడింది. ఇక, గ్రూప్-2 ద్వారా కేవలం ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-1లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే మెయిన్స్‌లో అదనంగా ఓ పేపర్‌ను చేర్చారు. మార్కులు పెంచారు. గ్రూప్-4 ఉద్యోగాలను మాత్రం పాతపద్ధతిలోనే భర్తీ చేయనున్నారు. గ్రూప్-2, 3, 4 పరీక్షలను ఆబ్జెక్టివ్ పద్ధతిలోనే నిర్వహిస్తారు. జూనియర్ లెక్చరర్ల పోస్టులకు మాత్రం ఆబ్జెక్టివ్, డిస్ర్కిప్టివ్, ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు చేపడతారు. నిరుద్యోగుల వయో పరిమితిని ఐదేళ్లు సడలించాల్సిందిగా కేబినెట్ సబ్‌కమిటీ సిఫారసు చేసింది. ప్రతిపక్షాలు ఒప్పుకొంటే పదేళ్లయినా సడలిస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. కానీ సబ్ కమిటీ మాత్రం ఐదేళ్లకు సిఫారసు చేసింది.

No comments:
Post a Comment