భారత కమ్యూనికేషన్ రంగంలో మరో ముందడుగు పడింది. భారత అంతరిక్ష పరిశోధన
సంస్థ రూపొందించిన అత్యాధునిక ఉపగ్రహం జీశాట్-15ను ఫ్రెంచ్ గయానాలోని
కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి బుధవారం తెల్లవారుజామున 3.04 గంటలకు
విజయవంతంగా ప్రయోగించారు. అరైన్ వీఏ-227 అనే వాహక నౌక ద్వారా విజయవంతంగా
దీన్ని నింగిలోకి పంపినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం సమాచార
వ్యవస్థలో సేవలందిస్తున్న ఇన్‌శాట్ 3ఎ, 4బి ఉపగ్రహాల కాలపరిమితి
కొద్దిరోజుల్లో ముగియనుండడంతో వాటి స్థానంలో దీన్ని ప్రయోగించారు. సుమారు
12 ఏళ్లపాటు ఈ ఉపగ్రహం నావిగేషన్ సేవల్ని అందించనుంది.జీశాట్-15
ఉపగ్రహంలో కేయూ బ్యాండ్‌లో 24 ట్రాన్స్‌పాండర్లు అమర్చారు. డీటీహెచ్,
బ్రాడ్‌బ్యాండ్, వార్తాఛానళ్ల డీఎస్‌ఎన్‌జీ సేవలను ఇది అందించనుంది.
సుమారు 3,164 కిలోల బరువుగల జీశాట్-15 ప్రయోగం కోసం రూ.660 కోట్లు ఖర్చు
చేసినట్లు ఇస్రో తెలిపింది. గతంలో ఇస్రో ప్రయోగించిన జీశాట్-8,
జీశాట్-10లను కూడా నావిగేషన్ సేవల కోసం వినియోగిస్తున్నారు. జీశాట్-15
తనతో పాటు గగన్ అనే నావిగేషన్ ఉపగ్రహ ట్రాన్స్‌పౌండర్‌ను తీసుకెళ్లింది.
ఇది ఎయిర్‌లైన్స్, ఇతర
జీపీఎస్ సేవలకు ఉపయోగపడుతుంది. ప్రయోగానంతరం జీశాట్-15 సిగ్నల్స్
కర్ణాటకలోని హసన్ నియంత్రణ కేంద్రానికి చేరాయి.ఉపగ్రహ వివరాలు
సంక్షిప్తంగా..జీశాట్ బరువు: 3,164 కిలోలుజీవితకాలం: 12 ఏళ్లుప్రయోగ
ఖర్చు: రూ.660 కోట్లుప్రయోగకేంద్రం: ఫ్రెంచ్ గయానాలోని (దక్షిణ అమెరికా)
కౌరు అంతరిక్ష కేంద్రం
No comments:
Post a Comment