నలుగురితోనూ కలవాలంటే సామాజిక మాధ్యమానికి మించిన సాధనం లేదు.
కేవలం స్నేహితులతో టచ్‌లో ఉండేందుకే కాదు, ఉద్యోగాల వేటలో ఉపకరించేది కూడా
ఈ మాధ్యమమే. ఫేస్‌బుక్ ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. మీ
ప్రొఫైల్‌ను పోస్ట్ చేయండి, మీకు ఉద్యోగం దొరకొచ్చు. మీరు చేస్తున్న
పరిశోధనకు సంబంధించిన వివరాలు పెట్టండి...మీకు చేయూత లభించవచ్చు. మీరు
తీసిన షార్ట్ఫిల్మ్‌ను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే, మీకో దర్శకుడినుంచో
నిర్మాతనుంచో పిలుపు రావచ్చు. అంతెందుకు, మీ విద్యార్హతలను, అనుభవాన్ని
వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ చిన్న ప్రొఫైల్ పెడితే వెంటనే ఉద్యోగమూ
దొరకవచ్చు. సోషల్ మీడియాలో మీరు ఇచ్చే చిన్న అడ్వర్టయిజ్‌మెంట్, మిమ్మల్ని
ఎక్కడికో తీసుకెళ్లవచ్చు. ఇలా ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తున్నవారికి సోషల్
మీడియా ఓ ఆధారంగా మారింది.
============
ఉద్యోగానే్వషణ కత్తిమీద సాము లాంటిది. ఒకప్పటిలాగ పేపర్లలోనూ,
మ్యాగజైన్లలోనూ వచ్చే అడ్వర్టయిజ్‌మెంట్ల ఆధారంగా ఉద్యోగాలను వెతికి
పట్టుకునే విధానానికి కాలం చెల్లి చాలాకాలమే అయింది. టెక్నాలజీ కొత్త
పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో సరైన సాధానాలను కనుగొని, వాటిద్వారా
ఉద్యోగాలను ఒడిసి పట్టక పోతే ఆనక చింతించీ ప్రయోజనముండదు.
నలుగురితోనూ కలవాలంటే సామాజిక మాధ్యమానికి మించిన సాధనం లేదు. కేవలం
స్నేహితులతో టచ్‌లో ఉండేందుకే కాదు, ఉద్యోగాల వేటలో ఉపకరించేది కూ డా ఈ
మాధ్యమమే. ఫేస్‌బుక్ ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. మీ
ప్రొఫైల్‌ను పోస్ట్ చేయం డి, మీకు ఉద్యోగం దొరకొచ్చు. మీరు చేస్తున్న
పరిశోధనకు సంబంధించిన వివరాలు పెట్టండి...మీకు చేయూత లభించవచ్చు. మీరు
తీసిన షార్ట్ఫిల్మ్‌ను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే, మీకో దర్శకుడినుంచో
నిర్మాతనుంచో పిలుపు రావచ్చు. అంతెందుకు, మీ విద్యార్హతలను, అనుభవాన్ని
వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ చిన్న ప్రొఫైల్ పెడితే వెంటనే ఉద్యోగమూ
దొరకవచ్చు. సోషల్ మీడియాలో మీరు ఇచ్చే చిన్న అడ్వర్టయిజ్‌మెంట్, మిమ్మల్ని
ఎక్కడికో తీసుకెళ్లవచ్చు. ఇలా ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తున్నవారి కి సోషల్
మీడియా ఓ ఆధారంగా మారింది. నిరుద్యోగుల పాలిట కల్పవృక్షంలా మారిన సోషల్
మీడియా సైట్ల వివరాలు 'యువ' పాఠకులకు ప్రత్యేకం.
linkedIn
లింక్డ్‌ఇన్ గురించి తెలియని యువతీయువకులు ఉం డరు. ఇందులో ప్రొఫైల్
పెట్టడాన్ని ఓ అర్హతగా చాలామం ది భావిస్తూ ఉంటారు. అయితే ప్రొఫైల్ పెట్టి
అంతటితో మరచిపోయేవారే ఎక్కువమంది. ముఖ్యంగా నిరుద్యోగులు తమ ప్రొఫైల్‌ను
ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. మీ ఇమెయిల్ ఐడీనుంచి మీకున్న
కాంటాక్ట్‌లన్నింటినీ ఇంపోర్ట్ చేయండి. మీ నెట్‌వర్క్‌ను విస్తరించుకోండి.
ఎందుకంటే ఏ అవకాశం ఏ మూలనుంచి వస్తుందో తెలియదు కదా?
plaxo.com
ఈ వెబ్‌సైట్‌కు కొంతవరకూ లింక్డ్‌ఇన్‌తో పోలికలు కనిపిస్తాయి. దానిని
ప్రఖ్యాత సంస్థ కాంకాస్ట్ నిర్వహిస్తోంది. simply hired.in అనే మరో సంస్థతో
కలసి ఉద్యోగ వివరాలను అందిస్తున్న జాబ్ సెర్చ్ ఇంజన్ ఇది. ప్రభుత్వ ఉద్యోగ
వివరాలతోపాటు వివిధ కంపెనీల్లో ఖాళీలు, లాభాపేక్ష రహితంగా నడిచే
ప్రభుత్వేతర సంస్థల వివరాలు వంటివన్నీ అందించే సైట్ ఇది.
twitter.com
ట్విట్టర్ గురించి తెలియనివారెవరు? నిరుద్యోగులను నేరుగా రిక్రూటర్లతో
అనుసంధానించే సామాజిక మాధ్యమంగా ట్విట్టర్‌ను చెప్పుకోవచ్చు.
craigslist.org
ఉధ్యోగాలు, హౌసింగ్, వస్తువులు, ఇతర సేవలు, రొమాన్స్ వంటి అనేక రంగాల్లో
వివరాలను అందించే వెబ్‌సైట్ ఇది. ఇమెయిల్ అప్‌డేట్స్‌కోసం సైనప్ చేసే
అవకాశం, రెజ్యూమెలను పోస్ట్ చేసే సౌకర్యం లేకపోయినా క్రెయిగ్‌లిస్ట్ వేలాది
ఉద్యోగాల వివరాలను మాత్రం అందిస్తూంటుంది. రకరకాల యాజమాన్యాలు తమ
సంస్థల్లో ఖాళీల వివరాలను క్రెయిగ్‌లిస్ట్‌లో ఉంచుతాయి.
myworkster.com
ఉద్యోగ వివరాలను అందించే మరో సోషల్ మీడియా సైట్ ఇది. ఎక్కువమంది ఫ్రెషర్లు
తమ పూర్వ విద్యార్థుల తో పరిచయం పెంచుకుని, తద్వారా ఉద్యోగావకాశాలు
గెలుచుకునేందుకు ఈ సైట్‌ను ఎంచుకుంటారు. అలాగే కాలేజీ విద్యార్థులూ తమ తమ
వివరాలను ఇక్కడ పొం దుపరిచే వీలుంది. రకరకాల ఈవెంట్లను నిర్వహిస్తూ
నిరుద్యోగులనూ, యాజమాన్యాలనూ ఒకే వేదికపైకి తెచ్చే మాధ్యమంగా మై
వర్క్‌స్టార్ పేరు సంపాదించుకుంది.
pinterest.com
పింటెరెస్ట్‌ను రెజ్యూమె బోర్డుగా వినియోగించుకునే వా రు చాలామందే
ఉన్నారు. ఫ్రీ లాన్స్ డిజైనర్లూ, ఫొటోగ్రాఫర్లూ తమ క్రియేటివ్ వర్క్
పదిమంది దృష్టిలో పడాలనే ఉద్దేశంతో పింటెరెస్ట్‌లో తమ వర్క్‌ను పోస్ట్
చేస్తున్నారు. తమ తాజా పనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను వెబ్ డిజైనర్లు
పింటెరెస్ట్‌కి పోస్ట్ చేయవచ్చు. ఫొటోగ్రాఫర్లు తమ ఫొటోలకు
పోర్ట్ఫోలియోలను లింక్ చేస్తూ పింటెరెస్ట్‌లో ఉంచితే ఆఫర్లు తగలొచ్చు.
jobfox
అభ్యర్థి వివరాలను పరిశీలించి, తగిన రిక్రూటర్‌ను వెతికిపెట్టే పనిని
చేపట్టిన వెబ్‌సైట్‌గా జాబ్‌ఫాక్స్‌ను చెప్పుకోవచ్చు. దీనికోసం మ్యూచువల్
స్యూటబిలిటీ సిస్టమ్ అనే ఓ విధానాన్ని అనుసరిస్తోంది. అభ్యర్థి అర్హతలను,
అనుభవాన్ని, లక్ష్యాలను విశే్లషించి, తగిన రిక్రూటర్‌ను కూడా సూచించడం దీని
ప్రత్యేకత. *
No comments:
Post a Comment