వెయిటేజీపై అభ్యర్థుల ఆందోళన: ఫైనల్ రాత పరీక్ష విషయంలో రిక్రూట్‌మెంట్ బోర్డు తీసుకున్న నిర్ణయం పట్ల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో పేపర్-1 కింద అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ (200 మార్కులు), పేపర్-2 కింద జనరల్ స్టడీస్ (200 మార్కులు), పేపర్-3 కింద ఇంగ్లిష్ (100 మార్కులు), పేపర్-4 కింద తెలుగు లేదా ఉర్దూ (100 మార్కులు)లకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్, తెలుగు లేదా ఉర్దూ పరీక్షలలో వచ్చిన మార్కులకు వెయిటేజీ ఇవ్వనున్నట్లు బోర్డు పేర్కొంది. గతంలో ఈ రెండు పేపర్లలలో అర్హత సాధిస్తే సరిపోయేది. కానీ ఈ సారి వెయిటేజీ ఇవ్వడాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై బోర్డు పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ఇక ప్రిలిమినరీ, ఫైనల్ రాత పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. గతంలో ఉన్న సిలబస్‌కు అదనంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను చేర్చారు. |
Tuesday, February 16, 2016
తెలంగాణలో10 నుంచి ఎస్సై పోస్టులకు దరఖాస్తులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment