హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థుల కలలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొలువుల భర్తీలో కీలకమైన సిలబస్, పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియపై స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. తెలంగాణలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన గ్రూప్-3 పోస్టులను, వాటి ఎంపిక విధానాన్ని సైతం ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు జీవో నంబరు 330ని విడుదల చేసింది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొత్త సిలబస్, ఎంపిక విధానాన్ని సూచించేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో జరిగే పోస్టుల భర్తీ విషయంలో అనుసరించాల్సిన ఎంపిక విధానం, కొత్త సిలబస్‌పై ఆ కమిటీ తన నివేదికను టీఎస్‌పీఎస్సీకి అందజేసింది.
అనుమతికోసం టీఎస్‌పీఎస్సీ ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ మేరకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేయగా.. నిపుణుల కమిటీ నివేదికను సమీక్షించిన మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఆ ప్రతిపాదనలన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానానికి సంబంధించిన ఖాళీలు, పరీక్షా ప్రణాళిక, విధానంపై టీఎస్‌పీఎస్సీకి మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని పాటించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రకటించిన సిలబస్, ఎంపిక విధానంపై తెలంగాణవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అన్ని స్థాయిల సిలబస్‌లోనూ తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆర్థిక, సామాజిక అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. సమైక్య పాలకుల హయాంలో అణచివేతకు గురైన తెలంగాణ సంస్కృతి, చరిత్ర, భౌగోళిక, ఆర్థిక స్థితిగతులను పూర్తిగా అవగాహన చేసుకునేందుకు ఈ నిర్ణయం ఉపయుక్తం అవుతుందని భావిస్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యే అధికారులకు తెలంగాణపై స్పష్టమైన అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ మేరకు ఉద్యోగార్థులు కూడా ఇప్పటికే తమ ప్రిపరేషన్ మొదలుపెట్టారు.టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీచేయబోయే వివిధ క్యాటగిరీ కొలువుల పరీక్షా ప్రణాళిక, విధానం పూర్తి వివరాలు
Group I Group II& Group III Syllabus Download
No comments:
Post a Comment