వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో వెల్లుల్లి బాగా తోడ్పడుతుంది. ఎందుకంటే వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇక ఫ్రూట్ జ్యూస్‌లు వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్-ఎ పుష్కలంగా ఉన్న క్యారెట్‌ను జ్యూస్‌గానూ.. ఇతర ఆహారపదార్థాల్లో చేర్చుకోవడం మంచిది. నిద్రలేమి వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేస్తుంది. సో.. కావాల్సినంత నిద్రతో శరీరం, మనసుకు విశ్రాంతి దొరికి.. త్వరగా కోలుకుంటారు
Showing posts with label Health. Show all posts
Showing posts with label Health. Show all posts
Saturday, October 31, 2015
నిరోధకశక్తి కోసం..
వర్షాకాలం దాదాపు ముగిసిపోయింది. చలికాలం వచ్చేస్తున్నది! ఇలా ప్రతీసారి సీజన్ మారినప్పుడల్లా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వాతావరణం కాస్త చల్లబడిందంటే చాలు.. జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్‌లాంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇంట్లో ఒకరికి వస్తే చాలు.. తేలికగా అందరికీ వ్యాప్తి చెందుతాయి. అలాంటి పరిస్థితుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. నిమ్మరసంలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఇది కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ప్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల ఇది మొత్తం శరీరం నొప్పుల్ని నివారించడానికి.. వికారాన్ని నయం చేయడానికి సహాయపడుతుంది.
వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో వెల్లుల్లి బాగా తోడ్పడుతుంది. ఎందుకంటే వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇక ఫ్రూట్ జ్యూస్‌లు వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్-ఎ పుష్కలంగా ఉన్న క్యారెట్‌ను జ్యూస్‌గానూ.. ఇతర ఆహారపదార్థాల్లో చేర్చుకోవడం మంచిది. నిద్రలేమి వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేస్తుంది. సో.. కావాల్సినంత నిద్రతో శరీరం, మనసుకు విశ్రాంతి దొరికి.. త్వరగా కోలుకుంటారు
Wednesday, September 23, 2015
జాతీయ పతాకాన్ని రక్షిద్దాం
లక్నో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్, జస్టిస్
యశ్వంత్‌వర్మలతో కూడిన ధర్మాసనం 2015, సెప్టెంబర్ 2న ఒక చరిత్రాత్మకమైన
తీర్పును వెలువరించింది. దేశంలో ఎన్నో విద్యాసంస్థలున్నాయి. అందులో కొన్ని
ప్రభుత్వంచేత నడుపబడుతున్నాయి. లేదా ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని
అందుకుంటున్నాయి. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, జనవరి 26 రిపబ్లిక్ డే
ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే
విద్యాసంస్థలు కూడా ఉండవచ్చు. అవి కూడా జాతీయ ఉత్సవాలను జరుపవలసి ఉంటుంది.
అంతేకాదు ఉర్దూమీడియంలో ఇస్లామిక్ మత శిక్షణ ఇచ్చే మదర్‌సాలు కూడా జాతీయ
ఉత్సవాలు జరుపవలసిందేనని లక్నో బెంచి తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు
చెందిన అరుణ్‌శౌర్ అనే వ్యక్తి దాఖలుచేసిన ప్రజాప్రయోజనాల వ్యా జ్యం (పిల్)
కారణంగా ఈ తీర్పు వచ్చింది. ల క్నో హైకోర్టు తీర్పు రావలసిన అవసరం ఏమి టి?
అంటే మదర్‌సాలు జాతీయోత్సవాలు జరుపవు అని తాత్పర్యం.
విద్యాసంస్థలలో గణేశ్ చతుర్ధి, నవరాత్రులు, దీపావళి జరుపుకోవాలనే నియమం
ఏమీలేదు. ఇది ఐచ్ఛికం. అరబిందో విద్యాసంస్థలల్లో జాతీయ జండా ఎగురవేసి
అరవింద జయంతి కూడా చేస్తుంటారు. అది వారి ఇష్టం. ఇందుకు
అభ్యంతరం ఏముంది?? కాని జాతీయ జెండా ఆగస్టు 15నాడు మదర్‌సాల మీద ఎందుకు
ఎగరటం లేదు? అంటే ప్రతి మదర్‌సా ఒక సం గ్రహ విదేశం-మీనియేచర్ పాకిస్తాన్-
అంతేకాదు ఆగస్టు 15నాడు హైదరాబాదు పాతబస్తీలో పాకిస్తాన్ చంద్రవంక జండాలు
ఎగురుతా యి. కాశ్మీరులో పాకిస్తాన్ జాతీయ గీతం పాడుతారు. మొన్న ఐఎస్‌ఐఎస్
(సిరియా ఉగ్రవాద సంస్థ) కాశ్మీరులో పాక్ జండాలు ఎగురవేసింది. భారత జాతీయ
పతాకాలు నేల కూల్చింది. 'మాకింకా స్వాతంత్య్రం రాలేదు' అంటూ దేశం లో కొన్ని
వర్గాలు అదే రోజు ఊరేగింపులు తీయటం మనకు తెలుసు. నల్లజెండాలను చైనా
ప్రేరేపిత ఉగ్రవాదులు ఎగురవేస్తుంటారు. దీనిని గత డెబ్బది సంవత్సరాలుగా మనం
చూస్తూనే ఉన్నాం. కాంగ్రెసు చేసిన ఉపేక్షాభావ ఫలితమిది. దేశ సమగ్రత ఆ
పార్టీ ఎజెండాలో లేదు. మదరసాల మీద జాతీయ జెండా ఆగస్టు 15నాడు ఎగురవేయాలి
అని ఒత్తిడి తెస్తే ఆ పిల్లల తల్లిదండ్రులు తమకు ఓట్లువేయరు అని
పాలకవర్గాలు భయపడ్డాయి. అంటే జాతీయ దినోత్సవాన్ని కూడా ఓటు బ్యాంకు
రాజకీయాలతో ముడిపెట్టడం ఏమిటి?? అమెరికాలో డెమొక్రట్స్-రిపబ్లికన్స్
భయంకరంగా కొట్టుకుంటారు. కాని జులై మొదటవ తేదీనాడు ఒకరిలో ఒకరు పోటీపడి తమ
జాతీయ జండాలను ఇంకా సమున్నతంగా ఎగురవేయడం అందరికీ తెలిసిన విషయమే. జాతీయ
జెండా కు రూపకల్పన చేసింది పింగళి వెంకయ్య. ఈయనకే పత్తి వెంకయ్య అని ఇంకొక
పేరు. తాను చనిపోతే జాతీయ జండా తనపై కప్పండి అని కోరుకున్న తెలుగువాడు
వెంకయ్య. ఈ దేశభక్తి నేడు ఏమయింది? నేను ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 33
సంవత్సరాలు పనిచేశాను. ఆగస్టు 15నాడు కొందరు జెండావందనానికి వచ్చేవారు
కాదు. ఎందుకని? వారు ఈ దేశ పౌరులు కాదా?
స్వాతంత్య్రోద్యమ కాలంనుండి పరిస్థితి ఇలాగే ఉంది. బంకించంద్ తన ఆనందమఠ్
అనే చారిత్రక నవలలో వందేమాతరం అనే గీతాన్ని వ్రాశాడు. తర్వాతి కాలంలో ఈ
గీతమే ఒక ఉద్యమంగా మారింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వందేమాతరం గీతాన్ని
భారత జాతీయ గీతంగా ఆమోదించాలని ప్రతిపాదన వస్తే కొన్ని వర్గాలు
వ్యతిరేకించాయి. కారణం అందులో ''త్వం హి దుర్గా దశప్రహరణ ధారిణీ'' అనే పదం
ఉంది. అంటే దుర్గ హిం దువుల దేవతామూర్తి. పూజకు సంకేతం. కాబట్టి మేము ఈ
గీతాన్ని పాడము అని కొన్ని వర్గాలు వ్యతిరేకించాయి. అప్పుడు జనగణమన జాతీయ
గీతం అయింది. దీన్ని రవీంద్రనాథ్ టాగూరు రచించారు. ఇందలి అధినాయకుడు
పంచమజార్జి. ఐనా హిందువులు మాట్లాడలేదు. జాతీయ గీతాన్ని గౌరవించారు. ఇదొక
చారిత్రక సత్యం.
1948 సెప్టెంబరు 17వ తేదీ తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చింది. అంటే దేశమంతా
జాతీయ జెండాలు ఎగురుతుంటే తెలంగాణలో మాత్రం నిజాం జండాయే ఎగురుతూ ఉండేది.
నెహ్రూ హైదరాబాదు కాశ్మీరు సంస్థానాల విషయంలో మెతక వైఖరి అవలంభించారు.
కాశ్మీరు సమస్యను తాను పరిష్కరించకుండా ఐక్యరాజ్యసమితికి సమర్పించారు.
వారికి ఈ పరిష్కారం మీద ఎక్కువ ఆసక్తిఉండదు. కాశ్మీరులో హరిసింగ్
(రాజాకరణ్‌సింగ్ తండ్రి) పాలకుడు. అక్కడి హిందూ పండిట్లు తరిమివేయబడటంతో
డెమోగ్రఫీ మారింది. అంటే కాశ్మీరు లోయ ముస్లిం మెజారిటీ ప్రాంతం అయింది.
ఇప్పుడు తాము హిందూస్థాన్‌లో ఎలా అంతర్భాగంగా ఉంటాము? అని
ప్రశ్నిస్తున్నారు. ఇదే కాశ్మీరు సమస్య. కళ్లూచెవులూ లేని మన రాజకీయ
నాయకులు చేసిన పాపఫలం కాశ్మీరు సమస్య. తెలంగాణ కూడా అలాంటి సమస్యే. ఇక్కడ
పాలకుడు నిజాం. చుట్టుపక్కల రాష్ట్రాలనుండి లక్షలాది ముస్లిములను 1947
తర్వాత హైదరాబాదుకు దిగుమతి చేశాడు. అంటే దీనిని ముస్లిం మెజారిటీ
రాజ్యాంగా మారిస్తే పాకిస్తాన్ వలె ప్రత్యేక దేశంగా ప్రకటించుకోవచ్చునని
భావించాడు. ఇందుకు ఆనాటి క్లారెయన్ పత్రిక ద్వారా పిలుపునిచ్చారు. అదే
సమయంలో స్థానిక హిందువులను నిజాం రాజ్యంనుండి తరిమివేసే కార్యక్రమం
మొదలయింది. ఈ చరిత్రను మారుస్తారా? కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఈ
అంశాలు పాఠాలుగా ఉంచుతారా? లేదా?? చరిత్రను రాజకీయ ప్రయోజనాలకోసం
దాచిపెట్టడం ఎందుకు?? కేరళలో మలాప్పురం అనే ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా
కాంగ్రెసువారు విభజించారు. కారణం అది ముస్లిం మెజారిటీ ప్రాం తం. 'మాకు
ప్రత్యేక జిల్లా ఇస్తే మీకు ఓటువేస్తాం'అని ముస్లింలీగ్ అనే కేరళ
పార్టీవారు చెప్పారు. అందుకు నాటి కేరళ ప్రభుత్వం అంగీకరించింది.
మొన్న ప్రపంచ యోగా దినోత్సవం జరిగింది. ఇది భారత్ చేసిన ప్రతిపాదన. మొత్తం
మానవాళి ఆమోదించింది. ముస్లిం దేశాలుకూడా యోగ చేసి ఆరోగ్య లబ్దిపొందారు.
యోగ అంటే సూర్య నమస్కారాలు. మేము చంద్రుడికి నమస్కారం పెడతాము కాని
సూర్యునికి ఎందుకు నమస్కరిస్తాము? అని కొందరు అభ్యంతరం చెప్పారు. సూర్యుడు
లేకుండా చంద్రునికి స్వతంత్ర అస్తిత్వం లేదు. కాంతి లేదు. అని
శాస్తజ్ఞ్రులు చెప్పారు. పోనీ! ఓం మిత్రాయనమః' వంటి మంత్రాలు లేకుండానే
సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. ఐనా కొన్ని వర్గాలు వ్యతిరేకించాయి. కొన్ని
ప్రభుత్వాలు వారికి మద్దతునిచ్చాయి. కొందరు ముఖ్యమంత్రులు యోగ దినోత్సవంలో
పాల్గొనలేదు. ఇది దేన్ని తెలియజేస్తుంది??
నెహ్రూ మెతక వైఖరి తెలిసిన సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ ఆయనతో చెప్పకుండా
చొరవ తీసుకొని నిజాం రాజ్యాన్ని రాత్రికిరాత్రే భారత యూనియన్‌లో కలిపాడు.
అంటే తెలంగాణ ప్రభుత్వం వల్లభ్‌భాయ్ పటేల్‌కు కృతజ్ఞత ప్రకటించి
అధికారికంగా సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవాలి కదా!! ఇం
దులో మళ్లీ ఓటు రాజకీయాలెందుకు?? క్రైస్తవ విద్యాసంస్థలలో బొట్టు పూలు
గాజులు పెట్టుకొని విద్యార్థినులు రాకూడదు. ఎందుకంటే ఇవి మత చిహ్నాలు
అన్నారు. వీళ్లకు జీతాలు కడుతున్నది భారీగా డొనేషన్లు ఇస్తున్నది ఎవరు?
ఆలోచించారా?? దాదాపు రెండువందల మంది నిరాయుధులైన అమాయకులను చంపి మరొక 600
మందిని వికలాంగులను చేసిన యాకుబ్‌మెమన్‌కు నేరంచేసిన పాతికేళ్ల తర్వాత
శిక్ష విధిస్తే దానిని రద్దుచేయాలని వామపక్ష మేధావులు ఆందోళన చేశారు. పూనా
ఫిలిం ఇనిస్టిట్యూట్‌కు కొత్త డైరెక్టరును నియమిస్తే అల్లర్లు
మొదలుపెట్టారు. ఔరంగజేబు దుర్మార్గుడు ఛత్రపతి శివాజీ దేశభక్తుడు అని
పాఠ్యాంశాలు వ్రాయిద్దాం అంటే వద్దు ఇది కాషారుూకరణం అన్నారు. భారత
స్వాతంత్ర సంగ్రామానికి రష్యానుండి స్ఫూర్తివచ్చింది అన్నారు. నేతాజీ
సుభాష్‌చంద్రబోసు జర్మనీ నాజీల ఏజెంటు అని ఆనాటి పత్రికలలో వ్రాశారు. ఈ
చరిత్రను ఇవ్వాళ మార్చలేరు. భారతదేశంలోని ముస్లిములంతా దేశద్రోహులు కారు.
హిందువులంతా దేశభక్తులూ కాదు. ముస్లిములలో అబ్దుల్‌కలాంలు ఉన్నారు.
హిందువులలో మణిశంకర అయ్యర్‌లూ ఉన్నారు. విదేశీయులు కలాంగారిని తమ దేశానికి
ఆహ్వానిస్తే ''ఇండియా నా మాతృదేశం. నా విజ్ఞానాన్ని నేను ఇండియాకే
సమర్పిస్తాను. నిలువెత్తు ధనం పోసినా నేను మీ దేశానికి రాను''అన్నారు కలాం.
మణిశంకర్ అయ్యర్ మాత్రం అండమాన్ వెళ్లి స్వతంత్ర వీర సావర్కార్ స్మృతి
చిహ్నాన్ని బద్దలుకొట్టి వచ్చా రు. ఇది ఇటీవలి సంఘటనే.
మదర్‌సాలు కాశ్మీర్‌లో ఉన్నా ఆక్రమిత కాశ్మీరులో ఉన్నా అక్కడ భారత జాతీయ
పతాకాలు ఎగరవు. మత వ్ఢ్యౌంతో కూడిన విద్యను అక్కడ నేర్పిస్తారు. తాలీమ్
అంటే మత బోధ. తాలిబాన్ అంటే అరబ్బీ భాషలో 'విద్యార్థి'అని అర్థం. ఇస్లామిక్
ఉగ్రవాదులూ చైనా ప్రేరేపిత తీవ్రవాదులు ప్రతి ఆగస్టు 15నాడు జాతీయ జెండాను
తగలబెట్టడం నల్లజండాలు ఎగురవేయటం గత డెబ్బది సంవత్సరాలుగా చూస్తూనే
ఉన్నాము. ''మదర్‌సా''అనేది అరబ్బీ పదం. మాతృభాషా బోధనా సంస్థ అని అర్థం-
ఇదే సంస్కృత ''మాతృ'' ''ఇంగ్లీషు'' ''మదర్'' శబ్దాలకు సమానార్థకం. ఇందులో
ఉర్దూ, అరబ్బీ, ఇంగ్లీషు సైన్సు నేర్పిస్తారు. ఐతే దీన్ మదర్‌సాలల్లో
ఖురాన్‌ను ప్రత్యేకంగా భట్టీయం వేయిస్తారు. హైదరాబాదు పాతబస్తీలోను
మదర్‌సాలు ఉన్నాయి. వాటికి ప్రభుత్వ పోషణ ఉంటుంది. ఇందులో కోఎడ్యుకేషన్
ఉంటుంది. ఐతే స్ర్తిలు పెద్దవారైన తర్వాత బురఖాలు ధరిస్తారు. నేడు భారత
సరిహద్దులలోని మదర్‌సాల్లో శాస్ర్తియ విజ్ఞానం, సాహిత్య బోధనలకన్నా అన్యమత
ద్వేషం నేర్పటం జరిగింది. 'తాలీమ్'నుండి (విద్య) తాలిబన్లు వచ్చారు. అంటే
ఉగ్రవాద విద్యార్థులు అని ఆ మాటకు అర్థం. అఫ్ఘానిస్థాన్‌లో స్ర్తిలు
విద్యాభ్యాసం చేయరాదు. పురుషులు షేవింగ్ చేసుకోరాదు. సౌదీ అరేబియాలో
స్ర్తిలకు డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వరు. ఎవరైనా నడిపితే వారిని
అరెస్టుచేస్తారు. బురఖా వేసుకోలేదని కాశ్మీరు లోయలో ఒక మహిళపై ఆసిడ్ దాడి
జరిగింది. వీరికి కాశ్మీరు ప్రత్యేక దేశం అనే భావన ఉంది. (హురియత్)
వేర్పాటువాదులు భారత రాజ్యాంగం జాతీయ జండా తమకు వర్తించదు అని భావిస్తారు.
'పతాకం'అంటే ఆ జాతి గౌరవానికి అస్తిత్వానికి పవిత్రతకు సంకేతం. 'సముద్రం
ఎవరిముందూ మొరగదు. పర్వతం ఎవరికీ వంగి సలాం చేయదు. నేను పిడికెడు మట్టినే
కావచ్చు కాని కలం పట్టినప్పుడు ఒక జాతి జండాకు ఉన్నంత పొగరు ఉంది' అన్నాడు
మహాకవి శేషేంద్ర.
పుచ్చకాయ వల్లన మూత్రపిండాల వ్యాధులు మాయం
పుచ్చ పండులో ఉన్నన్ని నీళ్ళు మరే పండులోగాని, కాయలోగాని లేవు. పుచ్చకాయలో
పొటాషియం ఎక్కువ ఉన్నది కాబట్టి మూత్రపిండాలు పనిచేయక ఉన్నవారు పుచ్చకాయలు
తినరాదు. కానీ మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు
ఉన్నవారు మూత్రపిండాలలో, మూత్రకోశంలో చిన్న చిన్న రాళ్లు ఉన్నవారికి
పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్ తేనె
కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు
తగ్గిపోతాయి. వేసవిలో అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలు తగ్గాలంటే
పుచ్చకాయ తింటే నివారిస్తుంది. అన్ని రకాల జ్వరాలలో పుచ్చకాయ రసంలో తేనె
కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు
ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. ఎండిపోయే పెదవులు
తడిగా ఉంచుతుంది.
దోమ కుడితే చూపు పోయింది..
కుట్టింది దోమే కదా.. అని దోమకాటును లైట్ తీసుకున్న ఓ బామ్మ గారు కంటి చూపు పోగొట్టుకున్న సంఘటన ఇది. యూకేకి చెందిన 69 ఏళ్ల ఓ మహిళ 2014లో గ్రెనెడా వెళ్లింది. అక్కడ దోమకాటు బారినపడింది. ఫలితంగా ఆమె.. జ్వరం, వొళ్లునొప్పులతో బాధ పడింది. అలా అనారోగ్యంతో బాధ పడుతూనే యూకేకు వచ్చేసింది. కొద్దిరోజులతరువాత కుడి కన్నులో బాగా నొప్పిగా ఉందనీ, ఆ కంటితో సరిగా చూడలేక పోతున్నానంటూ డాక్టర్‌ను కలవడంతో ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి చికెన్‌గున్యా సోకినట్టు నిర్ధారించారు. చూపుపోవడానికి కారణం తెలుసుకునేందుకు వారం రోజులపాటు నిశితంగా పరీక్షలు జరిపన డాక్టర్లు ఆమె కంటిలో ఆప్టిక్ నర్వ్ దెబ్బతిన్న కారణంగా చూపు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఇటువంటి కేసు రావడం చాలా అరుదనీ, యూకేలోఈకేసే మొదటి కేసు అనీ డాక్టర్లు తెలిపారు. అయితే కేవలం చికెన్‌గున్యా వల్లే ఈ సమస్య వచ్చిందా? లేదా ఇంకా ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనేది తెలుసుకునేందుకు మరిన్ని పరీక్షలు జరపాల్సిన అవసరం ఉందంటున్నారు డాక్టర్లు.
డయాబెటిక్ పేషెంట్లకు తీపికబురు!
డయాబెటిక్ పేషెంట్లకు శుభవార్త. ఈ రోగులు ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలకు
అర్హులేనని మద్రాస్ హైకోర్టు బుధవారం స్పష్టంచేసింది. షుగర్‌తో
బాధపడుతున్నవారు సక్రమంగా విధులు నిర్వహించలేరనడానికి శాస్త్రీయ ఆధారాలు
లేవని పేర్కొంది. అలాగే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న పుష్పమ్ అనే మహిళను
ఎనిమిది వారాల్లోగా జాబ్‌లోకి తీసుకోవాలని ఆదేశించింది.
ఎనిమిదేళ్ల కిందట 3698 గ్రూప్-డి పోస్టులకు సౌత్‌సెంట్రల్ రైల్వే
నోటిఫికేషన్ ఇచ్చింది. ఎంపికైన వారిలో మెడికల్ అన్‌ఫిట్ కింద 58 మంది
వున్నారు. వారిలో పుష్కమ్ కూడా ఒకరు. రీ మెడికల్ ఎగ్జామ్ తర్వాత 2012లో
ఆమెను ఉద్యోగానికి అనర్హురాలంటూ ఆ శాఖ తేల్చిచెప్పింది. దీంతో ఆమె
క్యాట్‌ని ఆశ్రయించింది. అనేక మలుపులు తిరిగిన ఈ కేసు చివరకు మద్రాసు
హైకోర్టుకు చేరింది. మధుమేహ కారణంగా ఉద్యోగంలోకి తీసుకునేందుకు రైల్వేశాఖ
తిరస్కరించడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. ఆమె అపాయింట్‌మెంట్‌ను
వ్యతిరేకిస్తూ రైల్వే సీపీఆర్‌వో దాఖలు చేసిన పిటిషన్‌ను ఇద్దరుసభ్యులతో
కూడిన ధర్మాసనం డిస్మిస్ చేసింది. అదే సమయంలో ధర్మాసనం కొన్ని ఆసక్తికర
వ్యాఖ్యలు చేసింది. డయాబెటిక్ రీసెర్చ్ ఫౌండేషన్ నివేదిక
ప్రకారం దేశవ్యాప్తంగా 40.9 మిలియన్ల మంది మధుమేహ వ్యాధి గ్రస్తులున్నారని,
వీళ్లని ఉద్యోగాల్లోకి తీసుకోబోమంటే కుదరదని తేల్చిచెప్పింది.
మందు తాగుతున్నావా ...?
సరదాగా సాయంత్రం పూట ఫ్రెండ్స్‌తో ఓ బీరేస్తే కొంపలంటుకోవులే బాస్ ..
అనుకునే వాళ్లకి కొన్ని షాకింగ్ నిజాలు! ఆల్కహాల్ చేసే చేటు గురించి
సైంటిఫిక్‌గా ప్రూవ్ అయినకొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటి సిప్ నాలుక
మీదనుంచి గొంతులోకి జారగానే మీకు మతిమరుపు మొదలవుతుంది. అలా ఒక క్వార్టర్
ఫినిషింగ్ అయిన పావుగంట తరువాత బాడీలో రసాయనిక చర్య జరిగి శరీరంలో
హ్యాపీనెస్ అనే కొత్త 'కెమికల్' రిలీజ్ అవుతుంది. దాని కారణంగా పెదవిపై
చిరునవ్వు తొణికిసలాడుతుంది. అరగంట తరువాత స్టమక్ యాక్టివేట్ అవుతుంది.
నాలుక కొత్త రుచులు కోరుతుంది. వేపుళ్లు, స్సైసీ స్నాక్స్ కావాలంటుంది. ఇక
60 నిమిషాలు గడిచి మూడో క్వార్టర్‌లోకి అడుగు పెట్టగానే ఆల్కహాల్ తన
ప్రభావాన్ని కిడ్నీలపై చూపడం మొదలుపెడుతుంది.
ఎక్కువ సార్లు యూరిన్‌కు వెళ్లాల్సి వస్తుంది. దీన్నే 'బ్రేకింగ్ ద సీల్'
అని పిలుస్తుంటారు. మందు మొదలుపెట్టి రెండుగంటలు అయ్యేసరికి నాలుగో
క్వార్టర్‌కు చేరుకుంటుంది. అప్పుడు మీ మనసు మీ మాట వినదు. బ్లడ్‌లో
ఆల్కహాల్ కలిసి నిన్న మొన్నటి సంగతుల్ని రీ కలెక్ట్ చేయడం మొదలుపెడుతుంది.
మీకు తెలియకుండానే మీ కిష్టమైన పాట హమ్ చేస్తుంటారు.
మందు ముందుకూర్చుని రెండున్నర గంటలు దాటిన తరువాత మాట తడబడుతుంది. ఇక మీరేం
మాట్లాడుతున్నారో మీకర్ధంకాదు. మీకు తెలియకుండానే పెద్దగా మాట్లాడటం
స్టార్ట్ చేస్తారు. మూడోగంట... ఆరోపింట్ బీర్.. లివర్‌లో హ్యాపీనెస్ 'కాక్
టైల్' అయి కొత్త ఎంజైమ్ పుట్టుకొస్తుంది. దానిపేరే 'రిమోర్స్'... స్వర్గం
ఎంత దూరం.. ఇంకెంత.. బెత్తెడే అన్నట్టుంటుంది. మందు మొదలెట్టి నాలుగో గంట
గడిచేసరికి ఇక నడవలేక, నిలబడలేక నానా ఇబ్బందులు మొదలు. వచ్చే వామ్టింగ్
సెన్సేషన్‌ను అపుకోవడానికి కారంగా ఉండే కబాబ్ ముక్క వెదుక్కుంటారు. అంటే
ఒకపింట్‌తోస్టార్ట్ అయి చివరకునానా యాతనలు పెట్టే మందుకథలు.. అనేకం..
మమేకం.. ఒకపెగ్గుతోఆగకుండా మందుతో మమేకమై తాగితే ఇంతే సంగతులుటున్నారు.
ఆ సర్టిఫికెట్ ఉండాల్సిందే
ఓ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ వెళ్ళగోరే
అధికారులు తమకు ఎయిడ్స్ గానీ, ఇతర జబ్బులు గానీ లేవని రుజువు చేసే మెడికల్
సర్టిఫికెట్లను సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. దేశ సంపద-
ఆర్థికాభివృద్ది అనే అంశంపై ఆ దేశంలో నెలరోజులపాటు (నవంబర్ 2నుంచి 30వ తేదీ
వరకు) శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి అటెండ్ అయ్యే సీనియర్
అధికారులు ఇలాంటి మెడికల్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా సమర్పించాలని
సిబ్బంది శాఖ తన తాజా సర్క్యులర్‌లో ఆదేశించింది. వాళ్ళు తమ దరఖాస్తులతో
బాటు వీటిని కూడా జత చేయాలట..
ఓ పరాయి దేశంలో శిక్షణకు హాజరయ్యేందుకు మానసికంగా, శారీరకంగా తాము అన్ని
విధాలా అర్హులమని డాక్టర్ల నుంచి ధ్రువ పత్రాలు తేవాలని, పైగా ఇంగ్లీష్ పై
కమాండ్, వాగ్ధాటి, మంచి ఆరోగ్యం ఉండాలని ఆ సర్క్యులర్ లో పీర్కొన్నారు.
ఇలాంటి వారికి విమానంలో ఎకానమీ క్లాస్ లో ప్రయాణించే వెసులుబాటు, హెల్త్
ఇన్సూరెన్స్, డైలీ అలవెన్స్ తదితర ప్రయోజనాలన్నీ కల్పిస్తున్నారు.
Subscribe to:
Comments (Atom)
